మరో కొత్త సినిమాకు సైన్ చేసిన రాజ్ తరుణ్.

మరో కొత్త సినిమాకు సైన్ చేసిన రాజ్ తరుణ్.

Published on Jan 13, 2015 7:02 PM IST

raju
‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో ప్రేక్షకులలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరో ‘రాజ్ తరుణ్’. యువతలో అతనికి మంచి క్రేజ్ ఏర్పడింది. వరుసగా పలు సినిమా ఆఫర్లు వచ్చాయి. వాటిలో మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘ఉయ్యాలా జంపాలా’ తర్వాత సుకుమార్ నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా రూపొందిస్తున్న ‘కుమారి 21ఎఫ్’తో పాటు ‘సినిమా చూపిస్తా మావ’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా మరో సినిమాకి సైన్ చేశాడు.

మార్చి 3వ వారంలో ఈ కొత్త సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్‌ గవిరెడ్డి అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై శైలేంద్రబాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో దర్శకుడు శ్రీనివాస్‌ ఈ సినిమా కథను రాసుకున్నారని సమాచారం. ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు