వైజాగ్ లో ల్యాండ్ అవ్వనున్న రాజమౌళి, రణబీర్..ఇందుకేనట.!

Published on May 28, 2022 4:00 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా దర్శకుడు అయాన్ ముఖర్జీ కాంబోలో తెరకెక్కించిన చిత్రం “బ్రహ్మాస్త్ర”.

తెలుగులో ఈ సినిమా రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ టీం తో కలిసి రాజమౌళి ఈ మే 31వ తేదీ మంగళవారం నాడు “బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ” ప్రమోషన్స్ లో భాగంగా ప్రత్యేకమైన ప్రారంభం కోసం విశాఖపట్నం నగరాన్ని సందర్శించనున్నారు.

అయితే రణబీర్, అయాన్ మరియు ఎస్.ఎస్.రాజమౌళి ప్రఖ్యాతి గాంచిన మరియు చారిత్రాత్మకమైన సింహాచలం దేవాలయం ను ముందు దర్శించుకుని ఆ తరువాత “ఐకానిక్ మెలోడీ థియేటర్‌” లో అభిమానులను కలవనున్నారు. లేటెస్ట్ గా మోషన్ పోస్టర్ నుండి “కుంకుమల” టీజర్ వరకు అన్ని ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి.

ఇక స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించాయి మాగ్నమ్ ఓపస్ సెప్టెంబర్ 9, 2022న
హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనుంది. అమితాబ్ బచ్చన్, రణబీర్‌, అలియా భట్, మౌని రాయ్ మరియు నాగార్జున అక్కినేని లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :