క్రేజీ..ప్రముఖ హాలీవుడ్ సంస్థతో జక్కన డీల్..డీటెయిల్స్ ఇవే.!

Published on Sep 23, 2022 8:00 am IST

ప్రస్తుతం మన తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా కూడా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎక్కడ పెట్టాడో చూస్తూనే ఉన్నాము. తాను చేసిన గత చిత్రాలు “బాహుబలి” సిరీస్ అలాగే భారీ మల్టీ స్టారర్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేసిన “రౌద్రం రణం రుధిరం” చిత్రాలు గ్లోబల్ గా సెన్సేషన్ ని రేపాయి. దీనితో ఈ అద్భుత చిత్రాల సృష్టికర్త జక్కన్న రాజమౌళి పేరు పలు హాలీవుడ్ సంస్థలు సహా దర్శక నిర్మాతలు వరకు కూడా వెళ్ళింది.

మరి ఇదిలా ఉండగా లేటెస్ట్ గా రాజమౌళి హాలీవుడ్ లో ఓ ప్రముఖ ఏజెన్సీ అయినటువంటి సి ఏ ఏ(క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ) వారితో డీల్ కుదుర్చుకోవడం సెన్సేషన్ గా మారింది. హాలీవుడ్ లో ఎన్నో బ్రాండ్స్ సహా ఎందరో నటీ నటుల వరకు ఈ ఏజెన్సీ నుంచే ఉన్నారు. మరి ఇలాంటి సంస్థతో రాజమౌళి డీల్ అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీనితో రాజమౌళి చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ ల విషయంలో అంశాలు మరింత కేజ్రీగా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :