ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విదేశాలలో?

Published on Aug 8, 2020 3:00 am IST


ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడి నాలుగు నెలలు దాటిపోయింది. అంతకంతకు దేశంలో పెరిగిపోతున్న కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో అర్థం కావడం లేదు. మరోవైపు షూటింగ్ పూర్తి చేయాలన్న టెన్షన్ రాజమౌళిలో పెరిగిపోతుంది. అందుకే ఆయన షూటింగ్ మొదలుపెట్టడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతుకుతున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విదేశాలలో చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న అక్షయ్ కుమార్ తన లేటెస్ట్ మూవీ బెల్ బాటమ్ షూటింగ్ కొరకు లండన్ వెళ్లారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సైతం విదేశాలలో చేయాలని రాజమౌళి భావిస్తున్నారట.

కాగా రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన పూర్తిగా వైరస్ నుండి కోలుకున్నాక దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశం కలదు. మరోవైపు ఎన్టీఆర్, చరణ్ సైతం షూటింగ్ లో పాల్గొనాలని ఉత్సాహంగా ఉన్నారు. 70 శాతం వరకు షూటింగ్ పూర్తికాగా, వచ్చే ఏడాది విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More