రాబోయే తరాలకు ధోని ఒక మార్గదర్శి – రాజమౌళి

రాబోయే తరాలకు ధోని ఒక మార్గదర్శి – రాజమౌళి

Published on Aug 16, 2020 11:00 AM IST

ప్రతీ దానికి ఒక ఎక్స్ ఫైర్ డేట్ ఉంటుంది అన్నట్టు ఈ లోకంలో ఏదీ కూడా శాశ్వతం కాదు. మారుతున్న కాలంతో అనుభవాలు కాస్తా జ్ఞ్యాపకాలు గా మిగిలిపోవాల్సిందే. అలాంటి జ్ఞ్యాపకాలనే క్యాప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని మిగిల్చారని క్రికెట్ అభిమానులు ఇప్పుడు అంటున్నారు.

నిన్న రాత్రి భారత జట్టు మాజీ సారధి ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించడంతో ఎందరిదో మనసు ముక్కలయింది. ఇక అవన్నీ పక్కన పెడితే కాస్త కష్టమే అయినా ధోని నిర్ణయాన్ని ఇతర ఆటగాళ్లు సహా మన టాలీవుడ్ అగ్ర నటులు మరియు దర్శకులు ఆహ్వానిస్తున్నారు.

అలా ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి ధోనీపై ఒక ఆసక్తికర ట్వీట్ పెట్టారు. “మమ్మల్ని ఎంటర్టైన్ చేసారు, గర్వపడేలా చేసారు, అన్నిటికన్నా మించి ఎంతగానో ఇన్స్పైర్ చేసారని, ఈ విషయం మాకు కాస్త కష్టంగానే ఉందని, భవిష్యత్తు తరాలకు మీరు ఒక మార్గదర్శకం” అని ట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపారు. జక్కన్న కూడా మహేంద్ర సింగ్ ధోనికి ఎంత అభిమానో “ఎం ఎస్ ధోని” తెలుగు ఆడియో లాంచ్ లో తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు