SSMB29: ఆ కాంట్రవర్సీకి చెక్ పెట్టేసిన రాజమౌళి!

SSMB29: ఆ కాంట్రవర్సీకి చెక్ పెట్టేసిన రాజమౌళి!

Published on Mar 19, 2025 9:58 AM IST

ప్రస్తుతం మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి అవైటెడ్ భారీ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కిస్తున్న చిత్రం కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రాన్ని అభిమానులు మొదటి నుంచీ మహేష్ 29వ సినిమానే అనే ట్యాగ్ తో పిలుచుకుంటున్నారు. అయితే ఇది కాస్తా తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ బాబు (SSRMB) అనే కొత్త ట్యాగ్ గా తర్వాత వచ్చింది.

కానీ దానిని మహేష్ అభిమానులు చాలా వరకు యాక్సెప్ట్ చెయ్యలేదు. ఇలా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఇతర న్యూట్రల్స్ నడుమ అలా కాంట్రవర్సీ నడిచింది కానీ ఫైనల్ గా దీనికి జక్కన్న చెక్ పెట్టేసారు. లేటెస్ట్ తన నుంచి ఒక లెటర్ పీస్ వైరల్ గా మారింది. అందులో తన సినిమా SSMB29 అంటూనే ట్యాగ్ పెట్టి సంతకం చేశారు. దీనితో తన సైడ్ నుంచే ఒక క్లారిటీ రావడంతో ఇక నుంచి ఇదే కొనసాగనుంది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు