ఆర్ ఆర్ ఆర్ హీరోలకు జక్కన్న అల్టిమేటం

ఆర్ ఆర్ ఆర్ హీరోలకు జక్కన్న అల్టిమేటం

Published on Mar 21, 2020 8:07 AM IST

రాజమౌళి మొదటిసారి ఆర్ ఆర్ ఆర్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక హీరోలకు గాయాలు కానివ్వండీ, అనుకున్న హీరోయిన్స్ మధ్యలో వెళ్లిపోవడం వంటి అవాంతరాలు ఎదురయ్యాయి. తాజాగా కరోనా కారణంగా మళ్ళీ సినిమా షెడ్యూల్ వాయిదా పడింది. ఇప్పటికే ఓ సారి మూవీ విడుదల తేదీ వాయిదా వేసిన నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా చెప్పిన తేదీకి రావాలని రాజమౌళి కృత నిశ్చయంతో ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్ మొదలైన తరువాత విరామం లేకుండా షూటింగ్ జరిపేలా ఆయన ప్లాన్ చేశారట. దీనితో ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలని అల్టిమేటం జారీ చేశారట.

ఐతే చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ కి మాత్రమే కమిటై ఉన్నాడు. ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ తో తన 30వ చిత్రం చేయాల్సివుండగా, ఇది మే నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఎన్టీఆర్ ఈ రెండు చిత్రాల షూటింగ్స్ ఎలా బ్యాలన్స్ చేస్తాడో చూడాలి. ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ జనవరి 21, 2021కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు