Rajamouli: “దేవర” స్పెషల్ షో వీక్షించిన జక్కన్న

చాలా రోజులు తర్వాత మన టాలీవుడ్ నుంచి వచ్చిన అవైటెడ్ సినిమానే “దేవర”. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కూడా ఒకటి. మరి తారక్ నుంచి ఎన్నో ఏళ్ళు తర్వాత వచ్చిన సోలో మూవీ ఇది కాగా అభిమానుల్లో అంచనాలు పీక్స్ లో నెలకొన్నాయి. మరి గ్రాండ్ గా నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అయితే అర్ధ రాత్రి సమయం నుంచే థియేటర్స్ లో పడిపోయింది.

మరి ఈ స్పెషల్ షోని ఎన్టీఆర్ అభిమాన దర్శకుడు ప్రైడ్ ఇండియా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి స్పెషల్ స్క్రీనింగ్ చూసినట్టుగా తెలుస్తుంది. రాజమౌళి సహా తన సతీమణి రామా రాజమౌళి కూడా కలిసి దేవర స్పెషల్ షో నేడు చూసారు. దీనితో పలు విజువల్స్ కూడా అభిమానుల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ క్రేజీ స్కోర్ ని అందించగా థియేటర్స్ లో తన స్కోర్ కి దద్దరిల్లుతుంది. మరి తారక్ కూడా తన అభిమానులకి మంచి ఫీస్ట్ ని అందించి అదరగొట్టాడు.

Exit mobile version