పవన్ కళ్యాణ్ తో రాజమౌళి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ప్రస్తుతానికి ఈ సినిమాల తాలూకా షూటింగ్ లు అన్నీ తాత్కాలికంగా నిలిపివేతలో ఉన్నాయి. అయితే పవన్ మంచి సమయం చూసి వీటి అన్నిటినీ మళ్ళీ రీస్టార్ట్ చేయనుండగా ఈ సందర్భం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ ఏపీకి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంకా పలు శాఖల మంత్రిగా కూడా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

అలాగే జస్ట్ కొన్ని రోజులు కితమే తాను వారాహి అమ్మవారి దీక్ష కూడా మొదలు పెట్టారు. అయితే ఈ దీక్షలో ఉండగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి పవన్ ని కలిసిన విజువల్ ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది నార్మల్ కలయికే కానీ ఎలాంటి సినిమా సంబంధిత కలయిక కాదు. నేడు రామోజీరావు గారి సంస్మరణ సభ జరుగగా అక్కడ పవన్, రాజమౌళి కూడా హాజరయ్యారు. సో ఇలా ఈ కలయిక జరిగింది.

Exit mobile version