సెంటిమెంట్ తో రాబోతున్న సీనియర్ హీరో !

సెంటిమెంట్ తో రాబోతున్న సీనియర్ హీరో !

Published on Mar 30, 2020 6:38 PM IST

ఇండస్ట్రీలో హీరోకు ఉండే క్రేజ్ మరో ఏ వ్యక్తికీ ఉండదు. అందుకే సీనియర్ హీరో డా. రాజశేఖర్ కూడా హీరోగానే కొనసాగడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ హిట్ తో తెలుగు ప్రేక్షుకులకు తన హీరోయిజాన్ని ఇంకా చూపించే ప్రయత్నం బలంగానే చేస్తున్నాడు. మధ్య మధ్యలో ఏ కార్ యాక్సిడెంట్ తోనో ఏ కాంట్రవర్సీ స్పీచ్ లతోనే వార్తలు నిలిస్తున్నా తన తరువాత చిత్రం చాల సీరియస్ గా దృష్టి పెట్టాడు ఈ సీనియర్ హీరో. ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ సినిమాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో సరికొత్త తరహా జోనర్ లో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో రాజశేఖర్ నటిస్తున్నాడు.

కాగా ఈ మూవీలోని కీలకమైన సీన్స్ చాల సెంటిమెంట్ గా ఉంటాయట. ఎమోషనల్ గా సాగే ఆ సీన్స్ రాజశేఖర్ పాత్రకు మరియు రాజశేఖర్ కూతురు పాత్రకు మధ్య వచ్చే సెంటిమెంటల్ సీన్స్ అని.. సినిమాలో ఆ సెంటిమెంట్ హైలైట్ అవ్వబోతుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ చిత్రానికి ఇంగ్లీష్ సినిమా ‘టోకెన్’ ప్రేరణ అట. ఆ మూవీలోని మెయిన్ పాయింట్ ఆధారంగానే ఈ చిత్రం స్క్రిప్ట్ రాసుకున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు