పేద సినీ కార్మికులకు రాజశేఖర్ చేయూత..!

పేద సినీ కార్మికులకు రాజశేఖర్ చేయూత..!

Published on Mar 22, 2020 7:58 PM IST

హఠాత్తుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ తో , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు , మన చలన చిత్ర పరిశ్రమ పెద్దలు తీసుకున్న నిర్ణయం మూలంగా షూటింగ్ లు రద్దు కావడంతో ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు కొందరు మన సంఘంలో వున్నారని తెలుసుకొని, అలాంటి కళాకారులకు, పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హీరో రాజశేఖర్ గారు తన బాధ్యతగా అందించాలని సంకల్పించారు.

రెక్కాడితే గాని డొక్కాడని అలాంటి నటీ నటులు, 9010810140 నంబర్ లో నవీన్ వర్మకు తమ పూర్తి వివరాలు అందించి తగు సహాయం పొందగలరు అని ఆయన తెలియజేశారు. సినీ కార్మికులు, కళాకారుల శ్రేయస్సు కొరకు రాజశేఖర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు