డేవిడ్ వార్నర్ కి రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ!

డేవిడ్ వార్నర్ కి రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ!

Published on Mar 25, 2025 6:49 PM IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “రాబిన్ హుడ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇపుడు రిలీజ్ కి దగ్గర పడుతున్న సమయంలో మేకర్స్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో కూడా చేస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో ప్రముఖ ఆస్ట్రేలియన్ డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తోనే వార్నర్ వెండి తెర పరిచయం కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ లో ఇటీవల సీనియర్ నటుడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ వార్నర్ పై చేసిన పలు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై తాజాగా రాజేంద్ర ప్రసాద్ స్పందించారు.

నాకు వార్నర్ అంటే ఎంతో ఇష్టం అతనికి మన సినిమాలు అంటే ఎంతో ఇష్టం అని తెలిపారు. అయితే వార్నర్ ని తాను ఉద్దేశ పూర్వకంగా అనలేదు అని ఒకవేళ ఈ విషయంలో ఎవరైనా బాధించబడి ఉంటే వారికి క్షమాపణలు తెలుపుతున్నాను అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. దీనితో తన లేటెస్ట్ క్లారిటీ ఇపుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు