2021 వరకు షూట్ కి రానంటున్న స్టార్ హీరో..!

Published on Jun 30, 2020 6:44 pm IST


సూపర్ స్టార్ రజిని కాంత్ 2020 వరకు షూటింగ్ కి హాజరుకానని దర్శక నిర్మాతలకు తెలియజేశాడట. ఆయన లేటెస్ట్ మూవీ అన్నాత్తే. మాస్ చిత్రాల దర్శకుడు శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా గ్రాండ్ గా మొదలైంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే 45 శాతం వరకు పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కారణం షూటింగ్ కి బ్రేక్ పడగా త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఐతే ఈ మూవీ షూటింగ్ లో 2020 ముగిసే వరకు రజని జాయిన్ కానని క్లియర్ గా చెప్పారట.

దీనితో 2021 సంక్రాంతికి ఈ మూవీ విడుదల చేయాలనుకున్న వారి ప్లాన్ కి బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. రజని వయసు రీత్యా కరోనా వైరస్ ఆయనకు చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. దీనితో ఆయన రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదని భావిస్తున్నాడట. రజని ఆదేశాల మేరకు వచ్చే ఏడాది ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రంలో మీనా, కుష్బూ, కీర్తి సురేష్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More