పేట మ్యూజిక్ అదిరిపోయింది గా !

పేట మ్యూజిక్ అదిరిపోయింది గా !

Published on Sep 7, 2018 5:55 PM IST

తలైవా రజినీ కాంత్ నటిస్తున్న165 వ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం ఉత్తరప్రేదేశ్ లోని లక్నో లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ ఈనెల చివరి వారంలో పూర్తి కానుంది . ఇక రజినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈచిత్రం యొక్క టైటిల్ ను మరియు మోషన్ పోస్టర్ ను కొద్ది సేపటి క్రితం విడుదలచేశారు. పెట్ట అనే టైటిల్ తో తెరకెక్కుతుంది ఈచిత్రం.

ఇక మోషన్ పోస్టర్ లో వినబడిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయందనే చెప్పాలి తన మ్యూజిక్ తో చాలా రోజుల తరువాత మళ్ళీ పాత రజినీ ని గుర్తుకు తెచ్చాడు యువ సంగీత దర్శకుడు అనిరుధ్. ‘జిగర్ తాండ్ర’ ఫెమ్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో సిమ్రాన్ , నవాజుద్దిన్ సిద్దిఖీ, ఫహద్ ఫాసిల్ విజయ్ సేతుపతి, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజినీ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఈచిత్ర షూటింగ్ ను తొందరగా పూర్తి చేసి రజినీ పాలిటిక్స్ లో బిజీ కానున్నారు. ఇదేఆయనకు ఆఖరి చిత్రం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని సమాచారం.

మోషన్ పోస్టర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు