తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ ముగించుకుంది. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.
కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఓ సాలిడ్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ ఏడాది ఆగస్టులో బాక్సాఫీస్ దగ్గర బిగ్ వార్ జరగనుంది. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నట్లు ఇప్పటికే బాలీవుడ్ క్రేజీ స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్-2’ను అనౌన్స్ చేశారు.
ఇప్పుడు అదే రోజున రజినీకాంత్ ‘కూలీ’ వస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర వార్ జరగడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఇక ‘వార్-2’లో హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. మరి బాక్సాఫీస్ వార్‌లో కూలీ గెలుస్తాడా.. లేక వార్-2 గెలుస్తుందా అనేది చూడాలి.