సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన సూపర్ స్టార్ !

సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన సూపర్ స్టార్ !

Published on Mar 7, 2018 11:07 AM IST

rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకవైపు సినిమా పనుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయ వ్యవహారాలను కూడ చక్కదిద్దుకుంటున్నారు. గత కొన్నాళ్ల నుండి సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను, ఆలోచనలను అభిమానాలు, ప్రజలతో పంచుకుంటూ వస్తున్న ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగిడుతున్న సందర్బంగా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు.

తాజాగా ఆయన పేస్ బుక్ https://www.facebook.com/Rajinikanth, ఇన్స్టాగ్రమ్ https://www.instagram.com/Rajinikanth/ మాధ్యమాల్లో అధికారికంగా ఖాతాను తెరిచారు. ఇక అభిమానులు ఈ ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా కూడ ఆయనతో టచ్ లో ఉండొచ్చు. ఇకపోతే గతంలో ఆయన తన అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్ లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినిమాల్లో ‘కాలా’ ఏప్రిల్ 27న రిలీజ్ కానుండగా ‘2.0’ కూడ విడుదల సన్నాహాల్లో ఉంది. అలాగే యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తో ఒక కొత్త సినిమాకు కొద్దిరోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీ.

తాజా వార్తలు