ఓటీటీలోనూ కొనసాగుతున్న రజినీకాంత్ “పెద్దన్న” హవా..!

Published on Nov 30, 2021 10:02 pm IST


సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో “పెద్దన్న” అనే టైటిల్‌తో దీపావళి కానుకగా నవంబర్‌ 4న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. మరీ కొత్తదనం లేకపోయినా కూడా రజినీ మేనియాతో ఈ చిత్రం రూ.250కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఇటీవల ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లోకి కూడా వచ్చేసింది.

అయితే థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా ఈ చిత్రం హవా కొనసాగుతుందనే చెప్పాలి. రోజువారీ టాప్‌ 10 చిత్రాల జాబితాలో తమిళ వెర్షన్‌ ‘అన్నాత్తే’ మొదటి స్థానంలో ఉండగా, హిందీ వెర్షన్‌ సినిమా రెండో స్థానంలో, తెలుగు వెర్షన్‌ ‘పెద్దన్న’ 9వ స్థానంలో కొనసాగుతోంది.

సంబంధిత సమాచారం :