‘వెట్టైయాన్’ కోసం డబ్బింగ్ చెబుతున్న సూపర్ స్టార్

‘వెట్టైయాన్’ కోసం డబ్బింగ్ చెబుతున్న సూపర్ స్టార్

Published on Sep 1, 2024 2:00 AM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయాన్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు జ్ఞాన్‌వేల్ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు ఇప్పటికే మొదలవగా, తాజాగా రజినీకాంత్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, దుషారా విజయన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు