తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్ ద హంటర్’ దసరా కానుకగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్ట్ చేయగా పవర్ఫుల్ కాప్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఇక తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
ఈ ట్రైలర్ కట్ పవర్‌ఫుల్‌గా ఉండటంతో పాటు సినిమా కథను దాదాపుగా రివీల్ చేశారు. నిజాయతీగల పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రజినీకాంత్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక రజినీ తనదైన మార్క్‌తో చేసిన యాక్షన్, ఆయన చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తున్నారు. అందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి వంటి స్టార్ యాక్టర్స్ కూడా ఉన్నారు.
వేట్టయన్ చిత్రంలో మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్, అభిరామి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను సుభాస్కరన్ ప్రొడ్యూస్ చేశారు. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది.