వేట్టయన్ ట్రైలర్‌కి డేట్ ఫిక్స్

వేట్టయన్ ట్రైలర్‌కి డేట్ ఫిక్స్

Published on Aug 1, 2024 12:00 AM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వేట్టయన్’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఆడియెన్స్‌ను థ్రిల్ చేయనుంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.

కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ అప్డేట్‌ను ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో అభిమానులు వేట్టయన్ చిత్ర ట్రైలర్ కట్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తితో ఉన్నారు.

ఇక ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు