రజినీకాంత్ డేరింగ్ డెసిషన్.. డైరెక్టర్ సూపర్ హ్యాపీ

రజినీకాంత్ డేరింగ్ డెసిషన్.. డైరెక్టర్ సూపర్ హ్యాపీ

Published on Oct 1, 2020 3:00 AM IST


కరోనా విజృంభణ తీవ్రంగా ఉండటంతో సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరు నెలలుగా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. సినిమా చిత్రీకరణల్లో పాల్గొనడం పూర్తిగా నిలిపివేసిన రజినీ తన రాజకీయ పార్టీ పనులను కూడ ఇంటి నుండే చేస్తూ వచ్చారు. ఇతర వ్యక్తులను కలవడం కూడ పూర్తిగా తగ్గించేశారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ తిరిగి మొదలవుతుండగా రజినీ చేస్తున్న ‘అన్నాతే’ సినిమా చిత్రీకరణను కూడ తిరిగి ప్రారంభించాలని డైరెక్టర్ శివ భావించారు. ఈమేరకు రజినీని సంప్రదించగా మొదట నో చెప్పిన ఆయన ఆ తర్వాత చిత్రీకరణలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సాధారణంగా 60 ఏళ్ల పైబడిన వ్యక్తులు బయటికి వెళ్లడం మంచిది కాదని, ప్రభుత్వం కూడ అదే చెబుతోందని రజినీ చిత్రీకరణకు నో చెప్పారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఓకే చెప్పినట్టు కొలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా షూటింగ్ అక్టోబర్ 15న హైదరాబాద్లో రీస్టార్ట్ కానుంది. సూపర్ స్టార్ అక్టోబర్ 8 నాటికి హైదరాబాద్ చేరుకుంటారట. షూటింగ్ మొదలయ్యే నాటికి టీమ్ మొత్తానికి కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ చేస్తారట. రజినీ హైదరాబాద్ సిటీకి ఫ్లైట్ ద్వారా కాకుండా వ్యక్తిగత కారులోనే వెళ్లనున్నారట.

రజినీ ధైర్యం చేసి చిత్రీకరణకు ఓకే చెప్పడంతో దర్శకుడు శివ చాలా హ్యాపీగా ఉన్నారట. ప్లాన్ ప్రకారమే షూటింగ్ జరపవచ్చని ఊపిరి పీల్చుకున్నారట. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో మీనా, నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ లాంటి స్టార్లు నటిస్తున్నారు. ఈ చిత్రం మీద రజినీ అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రజినీ ఇంట్రడక్షన్ సాంగ్ సుప్రసిద్ద గాయకుడు, ఇటీవలే కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు