రజినీ సినిమా ఇప్పట్లో లేనట్టే

Published on Jan 22, 2021 2:01 am IST


సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ఇప్పట్లో ఉండేలా కనిపించట్లేదు. రజినీ లాక్ డౌన్ ముందు శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ అనే సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ మూలంగా ఆగిన ఈ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్ నెలలో మొదలైంది. తమిళనాడు ఎన్నికలకు ముందే సినిమాను పూర్తిచేయాలని రజినీ అనుకున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ సెట్లో కోవిడ్ కలకలం రేగడం, ఉన్నట్టుండి రజినీ అస్వస్థతకు గురికావడంతో షూటింగ్ ఆగిపోయింది.

ఆ తర్వాత రజినీ రాజకీయాల్లోకి రావడంలేదని ప్రకటించడంతో పెద్ద దుమారమే రేగింది. అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొందరైతే రజినీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రజినీ సినిమా కూడ సందిగ్ధంలో పడింది. ఆరోగ్యం దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పిన రజినీ ఇప్పుడు బయటికొచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తే అభిమానులు అపార్థం చేసుకుంటారని, ఈ పరిస్థితుల్లో సినిమా విడుదల అంటే కష్టమేనని ప్రస్తుతానికి షూటింగ్ కూడ నిలిపివేశారట. దర్శకుడు శివ కూడ తన తర్వాతి సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. దీన్నిబట్టి రజినీ సినిమా ఇప్పుడప్పుడే మొదలయ్యేలా కనిపించట్లేదు.

సంబంధిత సమాచారం :