ఫుల్ స్వింగ్ లో “కూలీ”.. అక్కడ నాగ్ పై కీలక సన్నివేశాలు

ఫుల్ స్వింగ్ లో “కూలీ”.. అక్కడ నాగ్ పై కీలక సన్నివేశాలు

Published on Sep 10, 2024 3:05 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో “వేట్టైయన్” ఈ అక్టోబర్ లో రిలీజ్ కి రాబోతుండగా ఈ సినిమా తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో “కూలీ” అనే సినిమా తలైవర్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం పై కూడా భారీ హైప్ ఇప్పుడు ఉంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మార్క్ క్రేజీ తారాగణంతో సినిమాని నింపేయగా ఇందులో మన టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున కూడా కీలక పాత్ర చేస్తున్నట్టుగా రివీల్ చేశారు.

ఇందులో నాగ్ సైమన్ అనే ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తుండగా ఈ ఇప్పుడు నాజీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇప్పుడు నాగ్ కూడా వైజాగ్ లోనే ఉండగా అభిమానులతో కొన్ని విజువల్స్ కూడా బయటకి వచ్చాయి. మొత్తానికి అయితే నాగ్ ఈ భారీ సినిమాలో ఇప్పుడు బిజీగా ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు