బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కిన మున్నాభాయ్ MBBS, లగే రహో మున్నాభాయ్ చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయి. ఇప్పుడు మూడో పార్ట్ కోసం కసరత్తు చేస్తున్నామని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజ్‌కుమార్ హిరానీకి బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సడెన్ గా రాజ్‌కుమార్ హిరానీ మున్నాభాయ్-3ని ఎనౌన్స్ చేయడం విశేషం.
పైగా సంజయ్ దత్ తో తాను చేసిన గత సినిమాల కంటే మెరుగ్గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాజ్‌కుమార్ హిరానీ పేర్కొన్నారు. అన్నట్తు ఈ చిత్రాలను తెలుగులో శంకర్‌దాదా MBBS, శంకర్‌దాదా జిందాబాద్ పేరుతో మెగాస్టార్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కాగా హిరానీ, హీరో అమీర్ ఖాన్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. త్రీ ఇడియట్స్ సినిమా కథను వినిపించేందుకు తాను అమీర్ ఖాన్ వద్దకు వెళ్లినప్పుడు…అమీర్ చాలా సాధారణ దుస్తులు, చిరిగిపోయిన రబ్బరు చెప్పులు వేసుకున్నారు. సింపుల్‌గా ఉన్నా ధీమాగా ఉండగలగటమే స్టార్‌డమ్’ అని హిరానీ చెప్పుకొచ్చారు.