సమీక్ష : రాజుగారి గది 3 – ఎంటర్టైన్మెంట్ బాగుంది కానీ….

సమీక్ష : రాజుగారి గది 3 – ఎంటర్టైన్మెంట్ బాగుంది కానీ….

Published on Oct 19, 2019 3:02 AM IST
Raju Gari Gadi 3 movie review

విడుదల తేదీ : అక్టోబర్ 18, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : అశ్విన్ బాబు, అవికా గోర్,అలీ, ఊర్వశి, బ్రహ్మజీ, హరితేజ

దర్శకత్వం : ఓంకార్

నిర్మాత‌లు : ఓకే ఎంటర్టైన్మెంట్స్

సంగీతం : షబీర్

సినిమాటోగ్రఫర్ : చోటా కె. నాయుడు

ఎడిటర్ : గౌతమ్ రాజు

యువ హీరో అశ్విన్ మరియు టాలెంటెడ్ హీరోయిన్ అవికా గోర్ లు హీరోహీరోయిన్లుగా తనకి ఎంతో మంచి పేరు తీసుకొచ్చిన “రాజుగారి గది” కాన్సెప్ట్ తో ముందు డీసెంట్ ఫలితాన్ని అందుకున్న ఓం కార్ వాటికి కొనసాగింపుగా తెరకెక్కించిన తాజా చిత్రం “రాజుగారి గది 3” ఈ చిత్రం మంచి అంచనాల నడుమ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించి థ్రిల్ చేసిందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే అశ్విన్(అశ్విన్ బాబు) ఒక ఆటో డ్రైవర్.అతను ఉండే కాలనీవాసులకు బాగా చికాకు తెప్పించే పనులు చేస్తూ ఉంటాడు.అయితే కొన్ని దుష్ట శక్తులతో బాధింపబడే అమ్మాయిగా మాయ(అవికా గోర్) కనిపిస్తుంది.అలాంటి ఈ అమ్మాయితో అశ్విన్ ను ఎలా అయినా సరే ప్రేమలో పడేయాలని ఆ కాలనీ వాళ్ళు ఒక స్కెచ్ వేస్తారు.ఈ నేపథ్యంలో అశ్విన్, మాయకు ప్రపోజ్ చేసే సమయంలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి.కథలో అసలు ఈ మాయ అనే అమ్మాయి ఎవరు?ఆమె వెనకున్న అసలు కథ ఏమిటి? అలాగే ఈ కథ వెనుక ఉన్న సాలు మిస్టరీని అశ్విన్ ఎలా ఎదుర్కొని పరిష్కారం చేసాడు అన్నది తెలియాలంటే వెండి తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు ఓం కార్ ముందు రెండు సినిమాలతో పోల్చినట్లయితే ఖచ్చితంగా కామెడీ పై బాగా ఎక్కువ దృష్టి పెట్టారు అని చెప్పాలి.ఇది వరకే ఫస్ట్ పార్ట్ లో ఒక రేంజ్ కామెడీ ఉంటుంది.ఇప్పుడు మాత్రం దానికి మించిన స్థాయి కామెడితో సినిమాను నింపేసి ఎంటర్టైన్మెంట్ అందించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ముఖ్యంగా సెకండాఫ్ మొత్తం ప్రేక్షకులను ఒక రేంజ్ లో నవ్విస్తుంది.అలాగే ఓ భూత్ బంగ్లా లోని 20 నిమిషాల హారర్ కామెడీ ఎపిసోడ్ అయితే మరింత ఫన్ తో సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారిందని చెప్పొచ్చు.

ఇంతకు మునుపు చిత్రాలతో పోల్చుకున్నట్టయతే హీరో అశ్విన్ ఈ సినిమాకు చాలా చేంజ్ అయ్యారని చెప్పాలి.లుక్స్ పరంగా కానీ నటన పరంగా కానీ అశ్విన్ లో చాలా పరిణితి కనిపించిందని చెప్పొచ్చు.అలాగే దర్శకుడు ఓం కార్ కూడా అశ్విన్ లో ఉన్న అన్ని మెళుకువలను ప్రేక్షకులకు చూపించి ఆకట్టుకున్నారు.డాన్స్ మూమెంట్స్ కానీ యాక్షన్ సన్నివేశాల్లో కానీ అశ్విన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు.టాలీవుడ్ సీనియర్ నటుడు మరియు ప్రముఖ కమెడియన్ ఆలీ నుంచి ఈ సినిమా ద్వారా చాన్నాళ్లకు బాగా నవ్వించే రోల్ లో చూసినట్టు అనిపిస్తుంది.

అంతలా తన పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను నవ్వించారు.సెకండాఫ్ లోని హార్రర్ సీన్స్ లో ఆలీ మరియు అజయ్ గోష్ ల సన్నివేశాల్లో అయితే ఆలీ కామెడీ చాలా హిలేరియస్ గా వచ్చింది.భూటకపు బాబాగా అజయ్ గోష్ ఆ పాత్రలో చక్కగా కుదిరారు.అంతే కాకుండా మారో పాత్రలో కనిపించిన సీనియర్ నటి ఊర్వశి,అజయ్ గోష్ ల మధ్య కామెడీ సీన్స్ అద్భుతంగా పండాయి. అలాగే ధనరాజ్, బ్రహ్మాజీ లు తమ పాత్రల పరిధి మేరకు పూర్తి న్యాయం చేకూర్చారు.

హీరోయిన్ అవికా గోర్ తన పాత్ర పరిధి మేరకు ఎంతలో చెయ్యాలో అక్కడి దాకా మంచి నటనను కనబర్చింది.క్లైమాక్స్ ఎపిసోడ్ లో అయితే తన నటనా తీరును మెచ్చుకోక తప్పదు.ఇక ఇతర నటీనటులుగా కనిపించిన ప్రభాస్ శ్రీను,హరి తేజ మరియు గెటప్ శ్రీనులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మొదటి మైనస్ పాయింట్ గా చెప్పాల్సింది ఏమిటంటే అసలు స్క్రిప్ట్ లో పెద్దగా సీరియస్ నెస్ ఉన్నట్టుగా చిత్రాన్ని చూసే ప్రేక్షకుడికి అనిపించదు.సినిమా ఆరంభంలో కాస్త సీరియస్ గా మొదలైనట్టు అనిపించడంతో ఖచ్చితంగా కథనంలో ఏదొక ఊహించని మలుపు ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటారు.కానీ ఓం కార్ మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కు స్కోప్ ఇచ్చి ఇతర అంశాలను పక్కన పెట్టేసినట్టుగా అనిపిస్తుంది.

సినిమాలో వచ్చే కామెడీ పార్టీ బాగున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో దాని వలనే అసలు కథ సైడ్ ట్రాక్ పట్టనట్టుగా అనిపిస్తుంది.ఈ విషయంలో ఓం కార్ కాస్త కేర్ తీసుకుంటే బాగుండేది.అలాగే ఫస్ట్ హాఫ్ అంత ఆసక్తికరంగా కొనసాగకపోవడం మరి మైనస్ అని చెప్పొచ్చు.అసలు కథ అంతా సెకండాఫ్ లో మొదలుకావడం మూలాన ఫస్ట్ హాఫ్ పై ఎక్కువ దృష్టి పెట్టనట్టు సినిమా చూసే ప్రేక్షకుడికి అర్ధం అయ్యిపోతుంది.అలాగే ప్రీ క్లైమాక్స్ కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు.

సాంకేతిక విభాగం :

మామూలుగానే హారర్ చిత్రాలు అంటే సరైన కెమెరా పనితనం ఉండాలి.ఫ్రేమ్ ఎంత సహజంగా కనిపిస్తే చూసే ప్రేక్షకుడికి అంత థ్రిల్ అనిపిస్తుంది.ఈ విషయంలో చోటా కె నాయుడు కెమెరా పనితనం అద్భుతంగా ఉందని చెప్పాలి.అలాగే ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈ చిత్రానికి దర్శక బృందమే నిర్మాణ సారధ్యం వహించడం.నిర్మాణ విలువల విషయంలో వీరు ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రతీ అంశంలోనూ మంచి అవుట్ ఫుట్ ను అందించారు.షబీర్ అందించిన సంగీత పర్వాలేదనిపించినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది.

అంతేకాకుండా అలీ మరియు అజయ్ గోష్ ల మధ్య ఎపిసోడ్ లకు రాసుకున్న కామెడీ లైన్ చాలా బాగా వచ్చింది.2 గంటల నిడివి వచ్చేలా గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగుంది.ఇక దర్శకుని పనితనంకు వచ్చినట్టయితే ఓం కార్ తన ముందు చిత్రం “రాజుగారి గది 2” విషయంలో వచ్చిన విమర్శలను చెరిపేస్తూ మరింత ఎంటర్టైన్మెంట్ అందించడంలో సక్సెస్ అయ్యారు.కాకపోతే కథనంలోని చాలా తారాస్థాయి సన్నివేశాలు ఉన్నాయి కానీ వాటిని కామెడీతో కవర్ చేసేసినట్టు అనిపిస్తుంది. అలాగే తన తమ్ముడు హీరో అశ్విన్ ను బాగా చూపించడంలో ఎక్కువ కేర్ తీసుకోవడం మూలాన కథలోని లాజిక్ ను మిస్సయ్యారు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన “రాజుగారి గది 3” ఆకట్టుకుంటుందని చెప్పాలి.సెకండాఫ్ లో వచ్చే నాన్ స్టాప్ కామెడీ,ఆ 20 నిమిషాల కామెడీ ఎపిసోడ్లు కేవలం ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి.కాకపోతే ఎక్కువ వీటిపైనే దృష్టి పెట్టడం మూలాన డీసెంట్ కాన్సెప్ట్ కాస్త పక్కదారి పడుతుంది.కథ,కథనాలు ఎలా ఉన్నా ఎంటర్టైన్మెంట్ లను కోరుకునే వారికి మాత్రం ఈ చిత్రం మంచి ఆప్షన్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు