సమీక్ష : రాజు యాదవ్ – నిరుత్సాహ పరిచే కామెడీ డ్రామా !

Miral Movie Review in Telugu

విడుదల తేదీ : మే 24, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: గెటప్ శ్రీను, అంఖితా కారట్, ఆనంద చక్రపాణి, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచర్ల తదితరులు.

దర్శకుడు: కృష్ణమాచారి. కె

నిర్మాత: రాజేష్ కల్లేపల్లి, ప్రశాంత్ రెడ్డి

సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్

సినిమాటోగ్రఫీ: సాయి రామ్ ఉదయ్

ఎడిటింగ్: బొంతల నాగేశ్వర రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

గెటప్ శ్రీను హీరోగా అంఖితా కారట్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం రాజు యాదవ్. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

రాజు యాదవ్ (గెటప్ శ్రీను) ఓ ప్రమాదం కారణంగా ఎప్పటికీ నవ్వుతున్నట్లు అతని ఫేస్ లో మార్పులు వస్తాయి. ఆపరేషన్ చేస్తే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెబుతాడు. కానీ, ఆపరేషన్ కి డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి స్వీటీ (అంఖితా కారట్) వస్తోంది. ఆ తర్వాత రాజు జీవితం ఎన్ని మలుపులు తిరిగింది?, స్వీటీ – రాజు మధ్య అసలేం జరిగింది ?, వీళ్ళ మధ్య ప్రేమ అనేది ఉందా ? లేదా ?, చివరికి రాజు యాదవ్ కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన గెటప్ శ్రీను, తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్ లో మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో గెటప్ శ్రీను తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన అంఖితా కారట్ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. బోల్డ్ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సహజంగా నటించింది. ఓ సాఫ్ట్ వేరే అమ్మాయితో ఓ సాధారణ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది ? అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. ప్రధాన కథాంశం బాగుంది.

హీరోకి తండ్రిగా నటించిన ఆనంద చక్రపాణి కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన సంతోష్ కల్వచర్ల మెప్పించాడు. మిర్చి హేమంత్ నటన బాగుంది. ఇక జబర్దస్త్ సన్నీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో క్లైమాక్స్ బాగానే ఉంది. కొన్ని సెంటిమెంట్ సీన్స్ పర్వాలేదు.

 

మైనస్ పాయింట్స్ :

రాజు యాదవ్ సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యులర్ గా సాగడం ఈ సినిమాకి బాగా మైనస్ అయ్యింది. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే చాలా స్లోగా సింపుల్ గా సాగింది.

హీరో గెటప్ శ్రీను తాను ఎందుకు స్వీటీని ప్రేమిస్తున్నాడో అసలు ఆమె కోసం అతను ఎందుకు పిచ్చోడిగా అయిపోయాడో ఇంకా బలంగా చూపించాల్సింది. దీనికితోడు రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి. దర్శకుడు కృష్ణమాచారి. కె ఆసక్తికరమైన డ్రామాను జనరేట్ చేయడంలో విఫలమయ్యాడు. సెకండ్ హాఫ్‌లో చాలా సన్నివేశాలు మరీ సిల్లీగా నడిచాయి. అయినా ఈ సిల్లీ లవ్ డ్రామాకు అంత పెద్ద ల్యాగ్ ఏమిటో డైరెక్టర్ కే తెలియాలి.

పైగా మెయిన్ క్యారెక్టరైజేషన్స్ క్లైమాక్స్ లో ఇంట్రెస్ట్ గా అనిపించినప్పటికీ.. సినిమా మొత్తం వచ్చే సరికి ఆ క్యారెక్టరైజేషన్స్ కి క్లారిటీ మిస్ అయి ఆకట్టుకోవు. అలాగే సినిమాలో కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువవడంతో కథలో పూర్తిగా సహజత్వం లోపించింది. మొత్తమ్మీద ఈ రాజు యాదవ్ సినిమా నిరాశ పరిచింది. కథలో లాజిక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా లేదు.

 

సాంకేతిక విభాగం :

ఈ చిత్ర దర్శకుడు కృష్ణమాచారి. కె తన దర్శకత్వ పనితనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిల్ అయ్యాడు. స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సినిమాలో సాయి రామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు, కానీ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాతలు రాజేష్ కల్లేపల్లి, ప్రశాంత్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

‘రాజు యాదవ్’ అంటూ వచ్చిన ఈ లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కొన్ని కామెడీ సీన్స్ అండ్ లవ్ సీన్స్ జస్ట్ ఓకే. కానీ, సింపుల్ స్టోరీ, బ్యాడ్ నేరేషన్ అండ్ బోరింగ్ ట్రీట్మెంట్ అలాగే ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version