సమీక్ష: రాక్షస – డిజప్పాయింట్ చేసే బోరింగ్ థ్రిల్లర్

సమీక్ష: రాక్షస – డిజప్పాయింట్ చేసే బోరింగ్ థ్రిల్లర్

Published on Mar 9, 2025 6:06 PM IST

Rakshasa Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 08, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు : ప్రజ్వల్ దేవరాజ్, సోనాల్ మొంటెరియో, కే ఎస్ శ్రీధర్, బేబీ ఆర్న రాథోడ్, తదితరులు
దర్శకుడు : లోహిత్ హెచ్
నిర్మాతలు : దీపు బిఎస్, ఎంవీ రాధా కృష్ణ
సంగీతం : అజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ : జెబిన్ సి జాకబ్
ఎడిటింగ్ : రవిచంద్రన్ సి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో కన్నడ నుంచి రిలీజ్ అయ్యిన ఇంట్రెస్టింగ్ డబ్బింగ్ చిత్రం “రాక్షస” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథ లోకి వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ సత్య(ప్రజ్వల్ దేవరాజ్) కి ఒంగోలు ప్రాంతంలో ఒక తండాలు ఉండే గ్రామంలో ఒక సీరియస్ మర్డర్ కేసు కోసం కమిషనర్ నుంచి కాల్ వస్తుంది. వారు చేయలేనిది ఈ సత్య చేస్తాడు అని నమ్మి అతడికి ఇస్తే అతను మర్డర్ చేసినవాళ్ళని పట్టుకుని తన స్టేషన్ లో పెడతాడు. అయితే తర్వాత తన స్టేషన్ నుంచి ఒకొక్కరుగా బయటకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఆ స్టేషన్ లో అంతా అనుమానాస్పదంగా జరుగుతుండడం గమనిస్తాడు. అయితే ఈ పనులకి బ్రహ్మ రాక్షసునికి ఉన్న లింక్ ఏంటి? అసలు ఈ బ్రహ్మ రాక్షసుని కథేంటి? సత్యనే ఎందుకు టార్గెట్ చేసాడు? చివరికి సత్య ఏమయ్యాడు? ఆ బ్రహ్మ రాక్షసుడు ఏమయ్యాడు అనేవి మిగతా అంశాలు.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో ఒకింత ఇంట్రెస్టింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే సినిమాలో కోర్ లైన్ అని చెప్పవచ్చు. మన ఇతిహాసాలకి సంబంధించి తీసుకున్న ప్రధాన కథాంశం సినిమాలో బాగుంది.

అలాగే సినిమాలో ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం సినిమాటోగ్రఫీ అని కూడా చెప్పవచ్చు. ఈ చిత్రంలో చాలా సన్నివేశాల తాలూకా టేకింగ్ బాగుంది మెయిన్ గా ఫస్టాఫ్ లో కెమెరా వర్క్ కొన్ని యాంగిల్ నుంచి షాట్స్ బాగున్నాయి. ఇక హీరో ప్రజ్వల్ దేవరాజ్ కొన్ని సీన్స్ వరకు చూసేందుకు బాగున్నాడు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా ట్రైలర్ చూసాక డెఫినెట్ గా చాలా మంది ఇదేదో వర్కౌట్ అయ్యేలానే ఉందే అని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో కన్నడ సినిమా నుంచి కూడా వస్తున్న ఫాంటసీ సినిమాల తరహాలో ఏదో ఉంటుంది అనుకుంటే ఈ సినిమా ఇంకేదో చూపిస్తుంది. ఆరంభం మంచి లైన్ తో మొదలై ఈ సినిమాని ఎన్ని రకాలుగా నాశనం చెయ్యాలో అన్ని రకాలుగా కూడా దర్శకుడు నాశనం చేశారు.

అసలు తీసుకున్న లైన్ ఏంటి దానికి అల్లుకున్న కథనం ఏంటి అనేది చూసే ఆడియెన్ కి అర్ధం కాకుండా ఉంటుంది. పైగా ఇందులో మళ్ళీ టైం లూప్ కాన్సెప్ట్ పెట్టడం దాన్ని కూడా స్పాయిల్ చెయ్యడం ఎంతో చక్కగా జరిగింది. మైథాలజీ కమ్, టైం లూప్ కాన్సెప్ట్ లు ఎపుడూ మంచి ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. కానీ అవి పెట్టి కూడా సినిమాని ఎలా తీయకూడదో అలా ఈ చిత్రాన్ని తీశారు.

సినిమా కేవలం రెండు గంటలే అయినప్పటికీ అనవసరంగా సాగదీస్తూ సంబంధమే లేని అంశాలు జోడించి బోర్ గా నడిపించడం డిజప్పాయింట్ చేస్తుంది. అన్నట్టు ఇందులో ఆ రెండు ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా బోనస్ గా హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. వీటిలో ఒక్క సీన్ తప్ప ఇంకెక్కడా థ్రిల్ కనిపించదు.

ఇక హీరో కూడా తన రోల్ కి ఏమాత్రం సెట్ కాలేదు. నటన చాలా అసహజంగా ఉంది. తనపై చాలా అనవసర సీన్స్ పెట్టడం ఇంకా వరస్ట్ గా ఉంటుంది. తనపై ఆ యాక్షన్ సీన్స్ కూడా ఏమాత్రం సూట్ కాలేదు. అలాగే అజనీష్ లోకనాథ్ సంగీతం కూడా ఈ సినిమాలో డిజప్పాయింట్ చేస్తుంది. ప్రాపర్ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో లేవు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు కానీ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. చాలా సీన్స్ లో విఎఫ్ఎక్స్ బాలేవు. ఇంకా కొన్ని సీన్స్ లో అయితే ప్రింట్ తాలూకా వీడియో క్వాలిటీ చాలా తక్కువ కనిపిస్తుంది. టెక్నీకల్ టీం లో అయితే జెబిన్ సి జాకబ్ సినిమాటోగ్రఫీ తప్ప మిగతా అంతా డిజప్పాయింటింగ్ వర్క్ అందించారు.

ఇక దర్శకుడు లోహిత్ హెచ్ విషయానికి వస్తే.. తాను సినిమా కోసం మంచి లైన్ నే అందుకున్నారు కానీ దానిని ఎన్ని విధాలుగా డ్యామేజ్ చెయ్యాలో అంతకు మించే చేశారు అని చెప్పవచ్చు. అసలు తీసుకున్న లైన్ కి రాసుకున్న స్క్రీన్ ప్లేకి అసలు తాను ఎందుకు ఈ సినిమా చేశారు? ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది సినిమా మొత్తం అయ్యే వరకు కూడా కూడా అర్ధం కాదు. ఆ రేంజ్ లో తాను ఈ సినిమాకి తన వర్క్ అందించారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “రాక్షస” సినిమాలో ఒక్క కాన్సెప్ట్, సినిమాటోగ్రఫీ తప్పితే కనీసం ఓకే అనిపించే అంశాలు కూడా ఏమీ లేవు. ఆఖరికి హీరో కూడా ఈ సినిమాకి మైనస్ గానే నిలిచారు. ఇక దర్శకత్వం వైఫల్యం కూడా సినిమాలో చాలా ఎక్కువ ఉంది. వీటితో ఈ తరహా సినిమాలకి దూరంగానే ఉంటేనే మంచిది.

123telugu.com Rating: 1.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు