సమీక్ష : రాక్షసుడు – ఇంట్రెస్ట్ గా సాగే క్రైమ్ థ్రిల్లర్

Dear Comrade movie review

విడుదల తేదీ : ఆగస్టు 02, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  3.25/5

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్,అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, శరవణన్, వినోద్ సాగర్, రాధా రవి.

దర్శకత్వం : రమేష్ వర్మ

నిర్మాత‌లు : సత్యనారాయణ కోనేరు

సంగీతం : జిబ్రాన్

సినిమాటోగ్రఫర్ : వెంకట్ సి దిలీప్

ఎడిటర్ : అమర్ రెడ్డి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల అయ్యింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి. టీనేజ్ గర్ల్స్ ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చే సైకో కిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

 

అరుణ్(బెల్లంకొండ) ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కుటుంబ పరిస్థితులు, ఒత్తిడుల రీత్యా తన తండ్రి ఉద్యోగమైన పోలీస్ అధికారిగా చేరతాడు. నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి,చంపబడుతున్న సీరియల్ మర్డర్స్ కేసు చేధించే బాధ్యత అరుణ్ టీంకి దక్కుతుంది. ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది. అసలు ఆ కిల్లర్ ఎవరు? అతను టీనేజ్ అమ్మాయిల వరుస హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు?. అరుణ్ ఆ కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు? అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్:

సినిమా కాన్సెప్ట్ మరియు దాని తెరకెక్కించిన విధానం ఆకట్టుకొనేలా సాగుతుంది. సినిమా అనేది ఓ సైకో కిల్లర్ ని ఛేదించే పోలీస్ కథ అని తెలిసినప్పటికీ, దానిని తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడు అని చెప్పాలి.

ఇప్పటివరకు మాస్ హీరో పాత్రలలో కనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు. పాత్రకు తగ్గ విధంగా తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు, అలాగే భావోద్వేగ సన్నివేశాలలో నటించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తన పాత్ర పరిధిలో పరవాలేదనిపించింది.

సొంత కూతురు కిడ్నాప్ అయిన సందర్భంలో పోలీస్ గా రాజీవ్ కనకాల ఎమోషనల్ సన్నివేశాలలో చక్కగా నటించారు. ఇక సపోర్టింగ్ పాత్రలలో కనిపించిన కాశీ విశ్వనాధ్,తో పాటు మిగతా నటులు వారి పాత్ర మేర అలరించారు.

కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్, పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది. మొదటి సగంకి మించి రెండవ భాగం మరింత ఉత్కంఠ గా సాగడం ఈ చిత్రం కి కలిసొచ్చే మరో అంశం. కథలో మలుపులను దర్శకుడు చక్కగా ఆవిష్కరించి, ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు.

 

మైనస్ పాయింట్స్:

క్లైమాక్స్ కి ముందు వచ్చే సన్నివేశాలు కొన్ని ఆసక్తిగా సాగలేదు.క్రిమినల్ ఓ పోలీస్ అధికారికి దొరికిపోయిన తరువాత, చేతిలో గన్ ఉంది కూడా అతని చేతిలో మరణించడం సిల్లీగా అనిపిస్తుంది. సినిమా నిడివి కొరకు పెట్టినట్లున్న కొన్ని సన్నివేశాలు అసలు కథను ప్రక్కదారి పట్టించేలా ఉన్నాయి.

ఈ చిత్రం ఒరిజినల్ తమిళ వెర్షన్ చూసిన ప్రేక్షకుడికి ఈ చిత్రం అంత ఆహ్లాదంగా అనిపించదు.సాధారణంగా బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలలో ఉండే కమర్షియల్ అంశాలు ఆశించి వచ్చే ప్రేక్షకుడికి ఈ చిత్రం నిరాశకు గురిచేసే అవకాశం కలదు.

 

సాంకేతిక విభాగం:

ఇక జిబ్రాన్ అందించిన బీజీఎమ్ సినిమాలోని ఉత్కంఠ కలిగే సన్నివేశాలు గ్రిప్పింగ్ గా సాగడంతో ఎంతో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఆయన మ్యూజిక్ సన్నివేశాలకు ప్రాణం పోసింది. సినిమాలో నిర్మాణ విలువలు కూడా పర్వాలేదన్నట్లుగా ఉన్నాయి.తమిళ వర్జినల్ వర్షన్ స్ఫూర్తిగా ప్రొడక్షన్ డిజైన్ చేసినట్టున్నారు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించిన తీరు బాగుంది. అలాగే ఎడిటింగ్ కూడా సినిమాకు తగ్గట్లుగా ఆకట్టుకుంది. సన్నివేశాలు ప్రేక్షకుడికి అనుభూతి పంచడంలో కెమెరా పనితనం ఉపయోగపడింది.

తమిళ మాతృక అయిన రాక్షసుడు మూవీ ఆ ఒరిజినల్ ఫీల్ పోకుండా ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ రమేష్ వర్మ విజయం సాధించారు. కొత్త ప్రయోగాలకు దూరంగా ఒరిజినల్ వర్షన్ ని ఆయన మక్కికి మక్కి దించారు. యాక్షన్ సన్నివేశాలలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ని అద్బుతంగా ప్రెసెంట్ చేశారు. ఎక్కడా నిరాశ కలగకుండా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు.

 

తీర్పు:

 

మొత్తంగా చెప్పాలంటే ‘రాక్షసుడు’ కొద్దికాలంగా విజయాల పరంగా కొంచెం వెనుక పడ్డ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి బ్రేక్ ఇచ్చే చిత్రం అనడంలో సందేహం లేదు. ఈ చిత్రం ఎక్కడా ప్రేక్షకుడిని నిరాశపరచకుండా ఆద్యంతం ఉత్కంఠగా సాగే క్రైమ్ థ్రిల్లర్ . రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఆశించి సినిమాకు వెళ్లేవారిని ఈ చిత్రం అంతగా ఆకట్టుకోకపోవచ్చు, కానీ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకుడికి ‘రాక్షసుడు’ చిత్రం మంచి అనుభూతిని పంచుతుంది. ఈ వారానికి రాక్షసుడు మూవీ బెస్ట్ ఛాయిస్ అనడంలో సందేహం లేదు.

123telugu.com Rating :   3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version