రకుల్ పాపులారిటీలో సాటిలేదు అంటుంది.

Published on May 31, 2020 4:03 pm IST


హీరోయిన్ రకుల్ పాపులారిటీ మాములుగా లేదు. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య చూస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. మెస్మరైజింగ్ పిక్స్ తో ఫ్యాన్స్ కి కిక్కిచ్చే రకుల్ ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య ఏకంగా 14 మిలియన్స్ కి చేరింది. అంటే ఏకంగా కోటి నలభై లక్షల మంది రకుల్ ప్రీత్ ని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారన్న మాట. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత కంటే కూడా రకుల్ ముందు వుంది. సమంత ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్ కాగా రకుల్ కి 14మిలియన్స్ ఉన్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ తెలుగులో తక్కువగా సినిమాలు చేస్తుంది. నితిన్ హీరోగా దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన్ లో వస్తున్న మూవీలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. హిందీ మరియు తమిళ బాషలలో కలిపి అరడజను సినిమాలు రకుల్ చేతిలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More