అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం బాలీవుడ్‌పైనే పెట్టింది. అక్కడ సెలెక్టి్వ్‌గా సినిమాలు చేస్తూ ఈ అమ్మడు దూసుకుపోతుంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్‌తో కలిసి ‘దే దే ప్యార్ దే 2’ అనే సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉండగా, రీసెంట్‌గా రకుల్ ప్రీత్‌కి గాయం అయినట్లుగా తెలుస్తోంది.
జిమ్‌లో రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేసే రకుల్ ఇటీవల వెన్నుముక్క గాయంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆమె 80 కేజీల బరువును లిఫ్ట్ చేసే క్రమంలో వెన్నుముక్కకు గాయం అయినట్లుగా తెలుస్తోంది. అయితే, ఆమె వర్కవుట్ బెల్ట్ పెట్టుకోకుండా ఇంత భారీ వెయిట్ లిఫ్టింగ్ చేయడంతోనే ఇలా జరిగిందని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డాక్టర్లు ఆమెను పరిశీలించి, ఆమెకు కొన్ని వారాల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని సూచించారట.
ఇప్పటికే బెడ్ రెస్ట్ తీసుకుంటున్న రకుల్, మరికొన్ని వారాలపాటు ఇంటికే పరిమితం కానుంది. అయితే, ఆమెకు ఈ గాయం అయ్యి రెండు వారాలపైనే అవుతుందని.. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. దీంతో రకుల్ త్వరగా గాయం నుండి కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.