రకుల్ ప్రీత్ ఎన్సీబీ విచారణలో బయటపెట్టిన విషయాలు

Published on Sep 26, 2020 1:12 am IST


టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రియా చక్రబర్తి వెల్లడించిన పేర్లలో రకుల్ పేరు కూడ ఉండటంతో నిన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈరోజు ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆమె విచారణ సుమారు నాలుగు గంటల పాటు జరిగినట్టు తెలుస్తోంది. విచారణ మొత్తం డ్రగ్స్ వాడకం, రవాణా, రియా చక్రబర్తితో సంబంధాలు, డ్రగ్స్ రాకెట్లో విచారణ ఎదుర్కొంటున్న ఇతర వ్యక్తులతో పరిచయాలు అనే కోణాల్లోనే జరిగిందట.

ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ అశోక్ జైన్ స్టెట్మెంట్ ప్రకారం సిట్ అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ స్టెట్మెంట్ రికార్డ్ చేయడం జరిగిందని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి కోర్టుకు సమర్పించడం జరుగుతుందని తెలిసింది. ఇక జాతీయ మీడియాలో అయితే రకుల్ ప్రీత్ తనకు డ్రగ్స్ రాకెట్ తో ఎలాంటి సంబంధం లేదని, తానెప్పుడూ మాదకద్రవ్యాలు వాడలేదని బలంగా చెప్పినట్టు, అలాగే మరో నలుగురు యాక్టర్ల పేర్లు వెల్లడించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. అయితే రకుల్ మాత్రం విచారణకు హాజరయ్యే ముందు, విచారణ ముగిసి తన నివాసానికి వెళ్ళేటప్పుడు మీడియాతో ఎలాంటి సమాచారాన్ని షేర్ చేసుకోలేదు. తన మీద ఆరోపణలు మొదలైన వెంటనే ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తన మీద మీడియాలో నిరాధార ఆరోపణలు రాకుండా స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More