ఫాలోయింగ్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న రకుల్.

Published on Aug 5, 2020 10:43 am IST

గార్జియస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫాలోయింగ్ తనకు తిరుగు లేదని నిరూపిస్తుంది. ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 15 మిలియన్స్ కి చేరింది. అంటే ఏకంగా ఈ అమ్మడిని కోటిన్నర మంది ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారన్న మాట. దీనితో ఉబ్బి తబ్బిబవుతున్న రకుల్ తన అభిమానులకు కృతఙ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.

ఇక రకుల్ ప్రస్తుతం ఫోకస్ మొత్తం బాలీవుడ్ పై పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు హిందీ చిత్రాలు ఉన్నాయి. అలాగే కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 మూవీతో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తుంది. తెలుగులో మార్కెట్ కోల్పోయిన వెంటనే తెలివిగా ఇతర పరిశ్రమలలో బిజీ అయ్యింది రకుల్.

సంబంధిత సమాచారం :

More