నాన్నే నాకు స్ఫూర్తి – చరణ్

నాన్నే నాకు స్ఫూర్తి – చరణ్

Published on Jun 16, 2024 5:00 PM IST

హీరో రామ్‌ చరణ్‌ ఫాదర్స్‌ డే సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి చరణ్ చెప్పిన ఆ విశేషాలు ఏమిటో చూద్దాం రండి. ‘నా కూతురు క్లీంకారకు రోజుకు రెండు సార్లైనా నేనే తినిపిస్తుంటాను. నా కూతురికి తినిపించడం నాకు చాలా ఇష్టం. నేను గోరుముద్దలు పెడితే.. గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. ఆ విషయంలో నన్నెవరూ బీట్‌ చేయలేరు’ అంటూ చరణ్ తన కుమార్తెపై ప్రేమను తెలిపాడు.

ఇక ఫాదర్స్‌ డే సందర్భంగా చరణ్, మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా మాట్లాడుతూ.. ‘క్రమశిక్షణలో నాన్నే నాకు స్ఫూర్తి. ‘రామ్‌.. నువ్వెంత సక్సెస్‌ అయ్యావనేదాన్ని నేను పట్టించుకోను. కానీ, క్రమశిక్షణను అలవరుచుకో’ అని నాన్నగారు నాకు చెబుతుంటారు. ఇక క్లీంకారతో ఉంటే నాన్నగారు ఒక పిల్లాడిగా మారిపోతారు. ‘నన్ను తాత అని పిలవకు బోరింగ్‌గా ఉంటుంది. చిరుత అని పిలువు’ అంటూ ఆయన మురిసిపోతారు అని చరణ్‌ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు