శంకర్‌తో వర్క్ చేయడంపై రామ్ చరణ్ కామెంట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న గ్రాండ్ రిలీజ్‌కు రాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఘనంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన హిందీ ప్రమోషన్స్‌ను ముంబైలో నిర్వహించారు చిత్ర యూనిట్.

ఈ ఈవెంట్‌లో ‘గేమ్ ఛేంజర్’ టీమ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దర్శకుడు శంకర్‌తో వర్క్ చేయడం తన అదృష్టమని.. ఆర్ఆర్ఆర్ టైమ్‌లోనే శంకర్‌తో సినిమా గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పారని.. ఆయన చెప్పిన కథ విని అద్భుతంగా ఉందని తెలిపానని చరణ్ అన్నారు. ఆయనతో పని చేయడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశానని చరణ్ తెలిపాడు.

ఇక ఈ సినిమాలో ఎస్.జె.సూర్య పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని.. కియారాతో తాను చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చరణ్ పేర్కొన్నాడు. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని చరణ్ ధీమా వ్యక్తం చేశాడు.

Exit mobile version