“గేమ్ ఛేంజర్” లో చరణ్, ఎస్ జే సూర్య సీన్స్ నెక్స్ట్ లెవెల్లో..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి చరణ్, శంకర్ కలయికలో అది కూడా శంకర్ నుంచి మొదటిసారిగా డైరెక్ట్ తెలుగు సినిమా కూడా ఇదే కావడంతో మంచి అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఇపుడు నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా సెకండ్ సాంగ్ వచ్చి సాలిడ్ హిట్ అయ్యింది. ఇలా ప్రమోషన్స్ లో శంకర్ కామెంట్స్ వైరల్ గా మారాయి. గేమ్ ఛేంజర్ లో చరణ్ అలాగే ఎస్ జే సూర్య నడుమ సన్నివేశాలు థియేటర్స్ లో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని డెఫినెట్ గా వీరిద్దరి మధ్య సీన్స్ ని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని శంకర్ తెలిపారు. మరి ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే “సరిపోదా శనివారం” తన రోల్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక గేమ్ ఛేంజర్ లో ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version