లేటెస్ట్..తమ వెకేషన్ తర్వాత చరణ్, ఉపాసన ఫోటోలు వైరల్.!

Published on Sep 21, 2022 2:00 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తో తన కెరీర్ లో 15వ భారీ సినిమాని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు కూడా చేరుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి శంకర్ ఇప్పుడు బ్యాలన్సుడ్ గా ఇండియన్ 2 షూట్ కి వెళ్లగా హీరో చరణ్ కి కొంచెం ఖాళీ దొరికింది.

దీనితో ఫ్యామిలీ తో ఈ హ్యాపీ టైం ని అయితే తాను ఎంజాయ్ చేస్తుండగా లేటెస్ట్ గా తాను ముగించుకొచ్చిన చిన్న వెకేషన్ అనంతరం తన భార్య తో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడం జరిగింది. దీంతో ఈ స్టార్ జంట ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారాయి. ఇక దీని తర్వాత అయితే శంకర్ కూడా ఇండియన్ 2 షూట్ కొత్త షెడ్యూల్ కంప్లీట్ చేసి చరణ్ 15 కి రానున్నారు దీనితో ఈ చిత్రం స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :