ఫోటో మూమెంట్: బీస్ట్ మోడ్‌లోకి చరణ్.. RC16 లోడింగ్!

ఫోటో మూమెంట్: బీస్ట్ మోడ్‌లోకి చరణ్.. RC16 లోడింగ్!

Published on Sep 16, 2024 7:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్‌కి రెడీ చేశాడు. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ‘జరగండి’ సాంగ్‌కి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

అయితే, ఈ సినిమా రిలీజ్ కాకముందే, చరణ్ తన కెరీర్‌లోని 16వ చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా కోసం చరణ్ అప్పుడే మేకోవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ ఓ స్పోర్ట్స్ కోచ్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. దీని కోసం ఆయన బీస్ట్ మోడ్‌లోకి మారనున్నాడు.

తాజాగా చరణ్ బీస్ట్ మోడ్‌కి మారుతున్న ఫోటోని బ్లాక్ షేడ్‌తో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇక RC16 లోడింగ్ అంటూ ఈ ఫోటోకి ఆయన క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో RC16లో చరణ్ ఎలాంటి లుక్‌తో రాబోతున్నాడా అనే ఆసక్తి అప్పుడే మొదలైంది. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు