యూఎస్ ఆడియెన్స్ కి చరణ్ బిగ్ థాంక్స్.. వీడియో వైరల్

యూఎస్ ఆడియెన్స్ కి చరణ్ బిగ్ థాంక్స్.. వీడియో వైరల్

Published on Dec 22, 2024 3:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా తాలూకా ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ గా యూఎస్ లో గ్రాండ్ ఈవెంట్ ని డల్లాస్ వేదికగా చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. మరి చరణ్ ఒక స్పెషల్ వీడియో పెట్టి అందరికీ బిగ్ థాంక్స్ చెప్పాడు.

మరి ఓ సెల్ఫీ వీడియో తీసుకొని చరణ్ పోస్ట్ చేసాడు. తన వెనుక భారీ మొత్తంలో ఫ్యాన్స్ కేరింతలు కొడుతుండగా తన లైఫ్ లో ఇదొక మెమొరబుల్ మూమెంట్ అంటూ తాను పోస్ట్ చేసాడు. ఇలాంటి అమేజింగ్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన రాజేష్ కల్లేపల్లి అండ్ టీం కి స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను అని తెలిపాడు. అలాగే యూఎస్ అభిమానులకి థాంక్ యు సో మచ్ అంటూ చరణ్ పోస్ట్ చేసిన వీడియో ఇపుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు