చిరంజీవి కి రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకులు, అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేరారు. తండ్రి పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే పోస్ట్ చేశారు.

ప్రియమైన చిరుత కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. చిరంజీవి తాత అంటూ మనువరాలు విష్ చేసినట్లు గా రామ్ చరణ్ పేర్కొన్నారు. మా నుండి కొణిదెల కుటుంబం లోని లిటిల్ మెంబర్ నుండి ప్రేమ అంటూ చెప్పుకొచ్చారు చరణ్. చిరంజీవి మరియు తన కూతురు ఫోటో ను రామ్ చరణ్ సోషల్ మీడియా లో షేర్ చేశారు. కూతురు ఫేస్ ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు చరణ్. ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారుతోంది.

Exit mobile version