ఫోటో మూమెంట్ : భార్యతో సంక్రాంతి వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

తెలుగు ప్రజలకు ఎంతో సందడిగా జరుపుకునే సంక్రాంతి పండుగను టాలీవుడ్ స్టార్స్ కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఈ పండుగను కొందరు స్టార్స్ తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో జరుపుకునేందుకు ఇష్టపడితే.. మరికొందరు తమ చుట్టాలతో జరుపుకునేందుకు ఇష్టపడుతుంటారు.

తాజాగా సంక్రాంతి పర్వదినాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య కుమార్తెతో జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన భార్య ఉపాసన కొణిదెలతో పాటు కూతురు క్లిన్ కారాతో సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

సంక్రాంతి పర్వదినాన్ని అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఈ సందర్భంగా చరణ్ కోరుకున్నారు. ఇక తన అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు తానెల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Exit mobile version