మహేష్, ప్రభాస్.. వీరిలో చరణ్ ఎవరితో మల్టీస్టారర్ చేస్తాడంటే..?

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర పలు భారీ మల్టీస్టారర్ సినిమాలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో RRR కూడా ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల నడుమ వచ్చిన ఈ సినిమా తర్వాత మరిన్ని క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు ఇపుడు రాబోతున్నాయి. అయితే లేటెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ సమాధానంని బాలయ్య టాక్ షో అన్ స్టాప్పబుల్ సీజన్లో చెప్పినట్టుగా తెలిసిందే.

మరి బాలయ్య అడిగిన ప్రశ్న సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇద్దరిలో ఎవరితో మల్టీస్టారర్ చేస్తావు అని అడిగితే తాను మహేష్ తో చేసేందుకు రెడీ అని సమాధానం ఇచ్చాడట. దీనితో ఒకవేళ పరిస్థితిలు కలిస్తే డెఫినెట్ గా ఈ మెగా సూపర్ మల్టీస్టారర్ సాధ్యపడుతుంది అని చెప్పాలి. అయితే ఇవి మాత్రమే కాకుండా ఎన్నో క్రేజీ ప్రశ్నలకి సమాధానాలు చరణ్ ఇవ్వగా ఈ ఎపిసోడ్ రేపు జనవరి 8న స్ట్రీమింగ్ కి రాబోతుంది.

Exit mobile version