తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులను రాజకీయాలతో లింక్ చేసి ఆమె చేసిన కామెంట్స్‌పై సర్వత్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. అయితే, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలపై మండి పడుతున్నారు.
తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారహితమైనవిగా ఉన్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఓ నాయకురాలు ఇలా పబ్లిక్‌గా నీచంగా మాట్లాడటం షాకింగ్‌గా అనిపించింది. సమాజంలో మానవత్వ విలువలను ఇది పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఉంది.
సినిమా వారి వ్యక్తిగత జీవితాలను రాజకీయాలతో ముడిపెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని.. మా జీవితాలు మాకెంతో పవిత్రమైనవని రామ్ చరణ్ తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉంటున్న వారు ఇలా మాట్లాడటం నిజంగా హేయమైన చర్య అని రామ్ చరణ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
— Ram Charan (@AlwaysRamCharan) October 3, 2024