తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సినీ పరిశ్రమ నుంచి వరుసగా సాయం అందుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు మొదలుకొని యంగ్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా వారి జాబితాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తనవంతు సాయం అందించాడు.
ఏపీ, తెలంగాణ ప్రజలు తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని.. వారికి అందరూ బాసటగా నిలవాలని ఆయన పిలుపునిచ్చాడు. దీంతో పాటు, తనవంతు సాయంగా ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో రూ.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించాడు.
తెలుగు ప్రజలు ఈ కష్టకాలం నుంచి త్వరగా బయటపడాలని ఆయన ఆకాంక్షించారు. ఇక సినిమాల పరంగా రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్‌కి రెడీ చేస్తున్నాడు.
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి…
— Ram Charan (@AlwaysRamCharan) September 4, 2024