క్రేజీ పోస్టర్.. చరణ్ డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అదుర్స్.!

క్రేజీ పోస్టర్.. చరణ్ డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అదుర్స్.!

Published on Jan 4, 2025 10:04 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా అలాగే అంజలి మరో హీరోయిన్ గా అలాగే కీలక పాత్రలో నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. సాలిడ్ హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ తర్వాత మరింత హైప్ లోకి మారిపోయింది. అయితే ట్రైలర్ లో పలు షాట్స్ లో రామ్ చరణ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

మరి ఈ ట్రైలర్ లేటెస్ట్ గా అన్ని ప్లాట్ ఫామ్ లలో కలిపి ఏకంగా 180 మిలియన్ కి పైగా వ్యూస్ ని అందుకోవడంతో మేకర్స్ ఓ సాలిడ్ పోస్టర్ ని చరణ్ పై వదిలారు. ఇది చూసిన ఫ్యాన్స్ మాత్రం క్రేజీగా ఫీల్ అవుతున్నారని చెప్పాలి. ట్రైలర్ లో రామ్ చరణ్ పై తెల్లటి గుర్రంతో ఓ షాట్ చూసి అంత స్టన్ అయ్యారు.

మరి ఈ తెల్లటి గుర్రం పక్కనే చరణ్ కూడా వైట్ అండ్ వైట్ లో చాలా డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపిస్తున్నాడని చెప్పాలి. డెఫినెట్ గా చరణ్ ని ఈ లెవెల్లో ప్రెజెంట్ చేసిన దర్శకుడు శంకర్ విజన్ కి ఫ్యాన్స్ అయితే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి ఇది ఏ సాంగ్ లో ఉంటుందో కానీ బిగ్ స్క్రీన్స్ పై మంచి ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు