“చరణ్ 15” అప్డేట్ కోసం రచ్చ లేపుతున్న ఫ్యాన్స్.!

Published on Aug 12, 2022 8:09 am IST


ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియాస్ సెన్సేషన్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి నుంచి కూడా వస్తున్న బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ కి సంబంధించి డెఫినెట్ గా ఈ ఆగష్టు లో అప్డేట్ ఉంటుంది అని గట్టి బజ్ ఉన్న సంగతి తెలిసిందే.

కానీ ఈ ఒక్క విషయంలో అనే కాకుండా వేరే ఇతర అంశాల్లో కూడా సినిమా నిర్మాణ సంస్థ నుంచి ఎద్దగా అప్డేట్స్ ఏమీ బయటకి రాలేదు. ఇక దీనితో అయితే చరణ్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. నిర్మాత దిల్ రాజు పై ఒక ప్రేస్ ట్యాగ్ తో “వేకప్ దిల్ రాజు” అంటూ తమ సినిమాపై అప్డేట్ కోసం నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాపై అయితే అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :