‘చరణ్’ స్టెప్స్ కి అభిమానులు కేరింతలు

‘చరణ్’ స్టెప్స్ కి అభిమానులు కేరింతలు

Published on Dec 22, 2024 2:25 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ పొలిటికల్ డ్రామా పై మెగా ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏ భారతీయ సినిమాకు చేయని విధంగా విదేశాల్లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఐతే, వేదిక పై రామ్‌ చరణ్ ఎంట్రీ సందర్భంగా, అలాగే చరణ్ వేసిన స్టెప్స్ కి అభిమానుల కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లిపోవడం విశేషం.

ముఖ్యంగా వేదిక పైకి చరణ్ వస్తున్న సమయంలో అక్కడ ఉన్న అభిమానులు ‘స్టార్‌.. స్టార్‌.. గ్లోబల్‌ స్టార్‌’ అంటూ కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రామ్‌ నందన్‌ అనే యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపించడంతో పాటు, తండ్రి అప్పన్న పాత్రనూ ఆయనే చేశారు. అంజలి, సముద్రఖని, సునీల్‌, శ్రీకాంత్‌, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి తమన్‌ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు