మన టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే విక్టరీ వెంకటేష్ లు నటించిన చిత్రాలు “గేమ్ ఛేంజర్” అలాగే “సంక్రాంతికి వస్తున్నాం”ల కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో బాక్సాఫీస్ దగ్గర ఏవి రాణించాయి అనేది కూడా అందరికీ తెలుసు. ఇక ఈ చిత్రాల్లో రెండూ ఇపుడు ఓటిటిలో ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ సౌత్ భాషల్లో ప్రైమ్ వీడియోలో రాగా హిందీ వెర్షన్ మాత్రం జీ5 లో వచ్చింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం అయితే పాన్ ఇండియా భాషల్లో జీ5 లోనే వచ్చింది. మరి సంక్రాంతికి వస్తున్నాం ఓటిటిలో రికార్డు రెస్పాన్స్ ని కొల్లగొట్టింది. డే 1 నుంచే మోత స్టార్ట్ కాగా రీసెంట్ గానే 400 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ని నమోదు చేసింది.
అయితే గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్ ఇపుడు దీనికి మించిన రెస్పాన్స్ ని అందుకోవడం విశేషం. సంక్రాంతికి వస్తున్నాం పాన్ ఇండియా భాషల్లో మార్చ్ 1న వస్తే ఇప్పుడు వరకు 400 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ని అందుకుంది. కానీ గేమ్ ఛేంజర్ కేవలం హిందీ భాషలోనే అది కూడా మార్చ్ 7న అందుబాటులోకి వస్తే ఇపుడు దీనికి 250 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు అయ్యినట్టుగా జీ5 వారు కన్ఫర్మ్ చేశారు.
దీనితో ఓటిటిలో హిందీ వెర్షన్ కి మంచి రెస్పాన్స్ నే వచ్చింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఈ రెండు సినిమాలకి దిల్ రాజునే నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
View this post on Instagram