మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల జంట టాలీవుడ్‌లో హాట్ పెయిర్స్‌లో ఒకరని చెప్పొచ్చు. ఈ ఇద్దరూ కలిసి తాజాగా తమ కలల ఇంటిని నిర్మించుకుంటోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియానితో కలిసి రామ్ చరణ్ ప్రత్యేకంగా తన ఇంటిని డిజైన్ చేయించుకుంటున్నారు. తరుణ్ ఇప్పుడు హైద్రాబాద్‌లోని చరణ్ ఇంట్లో ఈ పనుల్లోనే ఉన్నారు.
రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ దగ్గరుండి తమ కలల ఇంటిని డిజైన్ చేయించుకుంటున్నారు. త్వరలోనే ఈ పనులన్నీ పూర్తవుతాయని, వెంటనే ఆ ఇంటికి మారేలా ప్లాన్ చేస్తున్నామని ఉపాసన తెలిపారు. మెగా పాలెస్ అన్న పేరుతో ఉపాసన ఈ ఇంటిని పేర్కొనడం విశేషంగా చెప్పుకోవాలి.
When Mr C and TT get down to create a mega palace for us. Can't wait to move in soon.#homesweethome #timelessdesigns #taruntahiliani pic.twitter.com/sGQY80gdyr
— Upasana Kamineni (@upasanakonidela) November 8, 2016


