వైజాగ్ లో అడుగు పెట్టిన “గేమ్ చేంజర్”

వైజాగ్ లో అడుగు పెట్టిన “గేమ్ చేంజర్”

Published on Jun 14, 2024 8:00 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. లేటెస్ట్ షెడ్యూల్ కోసం హీరో రామ్ చరణ్ వైజాగ్ లో అడుగు పెట్టారు. వైజాగ్ విమానాశ్రయం లో రామ్ చరణ్ ల్యాండ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గేమ్ చేంజర్ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ను స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రముఖ టాలివుడ్ నిర్మాత అయిన దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు