అద్దిరిపోయిన రామ్ చరణ్ లేటెస్ట్ లుక్!

అద్దిరిపోయిన రామ్ చరణ్ లేటెస్ట్ లుక్!

Published on Jul 27, 2024 2:00 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం హీరో రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి మరియు కుటుంబంతో పారిస్ ఒలింపిక్స్ చూసేందుకు వెళ్లారు. అయితే ఈ గ్యాప్ లో రామ్ చరణ్ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటో లో చాలా స్టైలిష్ గా ఉన్నారు. గడ్డంతో, కళ్ళకు అద్దాలు ధరించి, టోపీ పెట్టుకొని కౌ బాయ్ గెటప్ లో ఆకట్టుకుంటున్నారు. ఈ లుక్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఈ లుక్ తో ఏదైనా సినిమా చేస్తే చూడాలని భావిస్తున్నారు.

రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా తో ఒక చిత్రం చేయనున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అంతేకాక స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో కూడా మరొక చిత్రాన్ని చేయనున్నారు రామ్ చరణ్. ఈ సినిమాల పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు